తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ జెండా వందనం సమర్పించారు. జెండా ఆవిష్కరించిన అనంతరం నాటి సమర యోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం అసెంబ్లీ ఎదురుగా నున్న ఉక్కుమనిషి సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్, శాసనసభాపక్ష నేత జి.కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి. చింతా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.