*తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఈటల రాజేందర్, అహ్మద్ బలాలా తదితరులు పోచారంను స్పీకర్ కుర్చీ వరకు తోడ్కొని వెళ్లారు. ఆ తర్వాత ప్రొటెం స్పీకర్ నుంచి పోచారం బాధ్యతలు స్వీకరించారు. * ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పీకర్ కు శాలువ కప్పి అభినందించారు. పలువురు శాసనసభ్యులు స్పీకర్ కు అభినందనలు తెలిపారు.