తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రి గడ్కరీ వరాలు

రామంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధ్యక్షతన కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ వివిధ రహదారుల పనులకు  శనివారం  శంకుస్థాపన చేసారు 

1) హైదరాబాద్-ఓ.ఆర్.ఆర్ నుంచి  మెదక్ సెక్షన్ NH-765D జాతీయ రహదారి పై కి.మీ. 15/97 నుంచి  కి.మీ 78/70 వరకు (62.92 కి.మీ.నిడివి గల రహదారిని  రెండు వరుసలు + శోల్దర్స్) ఇ.పి.సి. ప్రాతిపదికన నిర్మాణం – అంచనా విలువ రూ. 426.52 కోట్లు.

2) హైదరాబాద్ బెంగుళూరు NH-44 జాతీయ రహదారి పై ఆరంగడ్శంషాబాద్ సెక్షన్ 9/9 నుంచి 19/948 కి.మీ మధ్య (10.048 కి.మీ.నిడివి గల రహదారిని  ఆరు వరుసలు) .పి.సి. ప్రాతిపదికన అభివృద్ధి అంచనా విలువ రూ. 283.15 కోట్లు.

3) అంబర్ పెట్ కూడలి వద్ద నాలుగు వరుసల ఫ్లైఓవర్హైదరాబాద్భూపాలపట్నం NH-202 జాతీయ రహదారి పై .పి.సి. ప్రాతిపదికన 1.465 కి.మీ నిడివి గల నాలుగు వరుసల ఫ్లైఓవర్ నిర్మాణం అంచనా విలువ రూ. 186.71 కోట్లు

4) ఉప్పల్ పట్టణ ప్రాంతంలో హైదరాబాద్భూపాలపట్నం NH-202 జాతీయ రహదారి పై 6.25 కి.మీ. నిడివి గల ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ .పి.సి. ప్రాతిపదికన నిర్మాణం అంచనా విలువ రూ. 626.76 కోట్లు

 గడ్కరీకి   శాసన మండలి చైర్మన్,  ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ స్పీకర్, మంత్రులు , ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర అధికార అనధికార ముఖ్యులు స్వాగతం పలికారు .

హైదరాబాద్ పట్టణం చుట్టూ ప్రాంతీయ బాహ్య వలయ రహదారి నిర్మాణానికి ప్రత్యేక నిధులు మంజురు కోసం  మంత్రి తుమ్మల కోరారు .

 సంగారెడ్డి – నర్సాపూర్ – తూప్రాన్ – గజ్వేల్ – జగ్దేవ్ పూర్  – భువనగిరి – చౌటుప్పల్ – ఇబ్ర హింపట్నం – చేవెళ్ళ – శంకరపల్లి – కంది –   338 కి.మీ),

 సెంట్రల్ రోడ్ ఫండ్ పద్దు క్రింద రూ:1000.00 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం మంజూరు చేయాలని మంత్రి తుమ్మల మనవి చేసారు. 

బోధన్- మద్నూర్ మధ్య 50 కి.మీ నిడివిగల రహదారిని రూ 1000  కోట్ల అంచనాతో నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేసేందుకు కోరారు .     

   వినూత్న మైన జలరవాణా పధకం కింద గోదావరి నది మీద పవిత్ర భద్రాచలం మీదుగా మహారాష్ట్ర – తెలంగాణ – ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు  1400 కిమీ నిడివి నది అనుసంధానానికి మంత్రి తుమ్మల కోరారు .

పాత సీతారామ ఇరిగేషన్ ప్రాజెక్టును పునర్వ్యవస్తీకరణకు ఆ విధంగా పాత ఆయకట్ స్థిరీకరణకు తోడ్పడాల్సిందిగా  నితీష్ గడ్కరీని మంత్రి తుమ్మల కోరారు .

 రాష్ట్ర రహదారుల మంత్రి  తుమ్మల అభ్యర్ధన మేరకు కొన్ని వరాలను వేదిక పైనుంచే  ప్రకటించిన కేంద్ర ఉపరితల రవాణా, రహదారులు, జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి  గడ్కరీ.

 హైదరాబాద్ పట్టణానికి మరో మణిహారం – భవిష్యత్తులో ఆర్ధిక, రవాణా , లాజిస్టిక్ అవసరాలను తీర్చగల ప్రాంతీయ బాహ్య వలయ రహదారి RRR – హైదరాబాద్ పట్టణం చుట్టూ ప్రాంతీయ బాహ్య వలయ రహదారి నిర్మాణానికి ప్రత్యేక రూ. 5500 కోట్ల రూపాయల నిధులు మంజురు చేసిన మంత్రి  గడ్కరీ

      సంగారెడ్డి – నర్సాపూర్ – తూప్రాన్ – గజ్వేల్ – జగ్దేవ్ పూర్   – భువనగిరి – చౌటుప్పల్ – ఇబ్రహింపట్నం – చేవెళ్ళ – శంకరపల్లి – కంది – (338 కి.మీ)

 సెంట్రల్ లోడ్ ఫండ్ పధకం లో రూ 750 కోట్ల రూపాయల నిధులు

 బోధన్-మద్నూర్ రహదారి విస్తరణకు 1000 కోట్ల మంజూరు

 అంబర్ పెట్ ఫ్లై ఓవర్ ను ఇంకో 200 మీటర్లు పెంచి అంబర్ పెట్ మార్కెట్ వరకు పొడిగింపు

తుమ్మల అభ్యర్ధన మేరకు గోదావరి నదిపై జల రవాణా ప్రాజెక్టును అంతరాష్ట్ర ప్రాజెక్టుగా ప్రకటించిన  గడ్కరీ. 

కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో మూడు రాష్ట్రాల వాటాతో – మహారాష్ట్ర – తెలంగాణ – ఆంధ్ర రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టుగా చేపట్టేందుకు అంగీకరించిన కేంద్ర మంత్రి గడ్కరీ, ఈ ప్రాజెక్టుకు మొదటగా 2000 కోట్ల నిధులను విడుదల చేస్తామని ప్రకటించిన కేంద్ర మంత్రి.

 సీతారామ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పునర్నిర్మాణ ప్రతిపాదనపై పరిశీలిస్తామని ప్రకటించిన  గడ్కరీ.

 

print

Post Comment

You May Have Missed