గతంలో ఇచ్చిన హామీలమేరకు తెలంగాణ రాష్ట్రానికి ఎయిమ్స్, ఐఐఎమ్ లు (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనెజ్మెంట్) మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కోరారు. న్యూ ఢిల్లిలో గురువారం రాత్రి అరుణ్‌జైట్లీని కలిసి పలు ఆర్థిక అంశాలపై చర్చించారు. గతంలో తెలంగాణ రాష్ట్రానికి ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. కేంద్రం ఎయిమ్స్ మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అవసరమైన స్థలం ఇవ్వడంతో పాటు మిగతా మౌలిక వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనెజ్మెంట్ (ఐఐఎమ్) మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి స్మృతి ఇరాని మాట ఇచ్చారని, దాని ప్రకారం ఐఐఎమ్ మంజూరు చేయాలని కోరారు. తెలంగాణలోని 10 పాత జిల్లాలోని 9 జిల్లాలను వెనుకబడిన ప్రాంతాల జాబితాలో చేర్చి ప్రతీ ఏటా రూ. 450 కోట్ల చొప్పున సహాయం అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన మూడు సంవత్సరాల మాదిరిగానే 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ. 450 కోట్లను విడుదల చేయలాని కోరారు. 3.5% ఎఫ్.ఆర్.బి.ఎమ్ పరిమితిని కొనసాగించాలని కోరారు. సీఎం వెంట ఎంపి జితేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, రామకృష్ణా రావు వున్నారు.
* Chief Minister K. Chandrashekar Rao met Union Minister of Finance & Corporate Affairs Arun Jaitley in New Delhi today night and discussed Budget related issues pertaining to the State government. M.P. Jithender Reddy and Telangana Government Chief Advisor Dr. Rajiv Sharma were also present.