తెలంగాణ రాష్ట్రంలో సర్వమత సమానత్వం, సౌభ్రాతృత్వం వర్థిల్లుతున్నదని నాందేడ్ గురుద్వారా బోర్డు అధ్యక్షుడు, మహారాష్ట్ర ఎమ్మెల్యే సర్దార్ తారాసింగ్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో గురువారం గవర్నర్ ముఖ్యకార్యదర్శి హరిప్రీత్ సింగ్, నాందేడ్ బోర్డులో రాష్ట్ర సభ్యుడైన ఎస్.దల్జీత్ సింగ్ తో కలిసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. 27.10.2016.
<
>