*తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం**దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు**రెండేళ్ళల్లో జడ్చర్ల సస్యశ్యామలం**పేదలకు మెరుగైన విద్య, వైద్యం**దొండ్లపల్లిలో రైతులకు పట్టా పాసు పుస్తకాలు, పంటల చెక్కుల పంపిణీ చేసిన వైద్య మంత్రి లక్ష్మారెడ్డి**కదలలేని స్థితిలో ఉన్న రైతు జంగయ్య ఇంటికి వెళ్లి రైతు బంధు చెక్కును పాసు పుస్తకం అందజేత*
*దొండ్ల పల్లి (రాజాపూర్)ః*కనీ వినీ ఎరగని రీతిలో ప్రజా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ *ప్రజా బంధు*గా మారిన సీఎం కెసిఆర్ ఇక రైతులకు భూ ప్రక్షాళనతోపాటు పట్టా పాసు పుస్తకాలు, పంటల పెట్టుబడి చెక్కుల పంపిణీతో *రైతు బంధు*గా కూడా మారారని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం దొండ్లపల్లిలో రైతు బంధు పథకంలో భాగంగా రైతులకు పట్టా పాసు పుస్తకాలు, పంటల చెక్కుల పంపిణీ చేశారు.
అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరగని రీతిలో అనేక అద్భుత ప్రజాప్రయోజన పథకాలను సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వమే కాదు, దేశంలోని అనేక రాష్ట్రాలు తెలంగాణ పథకాల వంక చూస్తున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో సైతం తెలంగాణలో అమలు అవుతున్న పథకాలను కొద్ది మార్పులతో ప్రకటించడమే ఇందుకు నిదర్శనమన్నారు. సమాజంలో వినూత్న, గుణాత్మక మార్పులు తెచ్చే అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఆయా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
రైతాంగానికి గత రుణాల మాఫీ, 24 గంటల విద్యుత్‌ని అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమన్నారు. ఇక పంటలు పండాలంటే అవసరమైన నీటిని కూడా ప్రాజెక్టుల ద్వారా అందిస్తున్న ఘనత కెసిఆర్‌ది అన్నారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి కావస్తున్నాయన్నారు. అలాగే అత్యంత వెనుకబడిన వలసల జిల్లా మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తుండటమే కెసిఆర్ ముందు చూపు, ఔదార్యం, గొప్పగుణాలకు నిదర్శనమన్నారు.
రైతులకు సాగునీరు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తున్నదన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తపోతల పథకం, కల్వకుర్తి ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ, పాలమూరుతోపాటు జడ్చర్ల సస్యశ్యామలం అవుతుందన్నారు. ఆ బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
కాగా, *బాలానగర్ మండలం గుండేడు గ్రామంలో ప్రమాదంలో గాయపడి కదలలేని స్థితిలో ఉన్న రైతు జంగయ్య ఇంటికి వెళ్లి రైతు బంధు చెక్కును పాసు పుస్తకాన్ని మంత్రి లక్ష్మారెడ్డి అందచేశారు*
రాజాపూర్ మండలం చొక్కంపేట గ్రామంలో నిర్వహించిన రైతుబంధు కార్యక్రమంలో తనకు ప్రభుత్వం ద్వారా వచ్చిన రూ. 2.26 లక్షల చెక్కును రైతు గిరిధర్ రెడ్డి మంత్రి లక్ష్మారెడ్డికి అందచేశారు
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపిపి, ఎంపిటీసీ, సర్పంచ్, రైతులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.