తెలంగాణ ప్రముఖుల పేర్లు చరిత్రలో నిలిచేలా చర్యలు
ఆర్బివిఆర్ ఎడ్యుకేషనల్ క్యాంపస్ శంకుస్థాపనసందర్బంగా సీఎం కేసీఆర్
రంగా రెడ్డి ఆగష్టు 22(ఎక్స్ ప్రెస్ న్యూస్); ఓకటిన్నర శతాబ్ధం క్రితం వికసించిన కుసుమం రాజాబహుదూర్ వెంకటరామారెడ్డి అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ ప్రాంతంలో ఎంతోమంది మహానుభావులు ఎన్నో గొప్ప పనులు చేసినా సమైక్య రాష్ట్రంలో వారి ప్రస్తావన ఎక్కడా లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే రాష్ట్రం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే పోలీస్ అకాడమీకి ఆయన పేరు పెట్టినట్టు చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని బుద్వేల్లో రెడ్డి హాస్టల్ సముదాయానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజలు, పేదలు, అవకాశాలు లేని వారి కోసం ఆయన ఆలోచించారని అన్నారు. రెడ్డి ఆధ్వర్యంలో 14 విద్యా సంస్థలు ఏర్పాటు చేశారని కొనియాడారు. ఆయన స్థాపించిన పాఠశాలలో అందరికీ విద్యను అందించి విద్యా వ్యాప్తికి దన్నుగా నిలిచారన్నారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్ లో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ క్యాంపస్ కు సీఎం కేసీఆర్ మంగళవారం శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇప్పుడు కేటాయించిన 10 ఎకరాలకు తోడు మరో 5ఎకరాలు కలిపి ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. వెంకట్రామిరెడ్డి స్థాపించిన సంస్థకు తాను ఇచ్చింది చంద్రునికో నూలుపోగు వంటిందని పేర్కొన్నారు. ఇది తెలంగాణ చరిత్రను పునరుద్ధరించే అంశమని తెలిపారు. మన తెలంగాణ విద్యార్థిని, విద్యార్థులకు ఈ విద్యాసంస్థ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రెడ్డి హాస్టల్ కు శంకుస్థాపన చేయడం సంతోషకరమన్నారు. బుద్వేల్ ప్రాంతం ఎడ్యుకేషన్ హబ్ గా మారాలన్నారు. నారాయణగూడలో ఉన్న బాలికల హాస్టల్ విస్తరణ కోసం.. దాని పక్కనే ఉన్న ఐపీఎంకు చెందిన 1500గజాల ఖాళీ స్థలాన్ని కేటాయిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. రెడ్డి విద్యాసంస్థలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు.ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నాం.. రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి హాస్టల్శంకు స్థాపన చేయడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు .. ఒక మంచి కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టుకున్నాం. ఉద్యమ సందర్భంలో చాలా బాధ పడేవాళ్లం. సమైక్య రాష్ర్టంలో మహనీయుల పేర్లు కనుమరుగైపోయాయి.. ప్రస్తావన లేకుండా పోయారు. రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ప్రస్తావన లేదు. సురవరం ప్రతాప్ రెడ్డి వెంకట్రామిరెడ్డి చరిత్ర రాసి మనకు అందజేశారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డ తొలినాళ్లలోనే అప్పా పేరు రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి పేరు పెట్టుకున్నాం. ఆయన పోలీసు కొత్వాల్ గా పని చేశారు కాబట్టి వెంకట్రామిరెడ్డిని గౌరవించుకున్నామనితెలిపారు.వెంకట్రామిరెడ్డి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత పదవి చేపట్టారు. అప్పట్లోనే కొత్వాల్ పదవి అంటే డీజీపీతో సమానమని చెప్పారు సీఎం. 14 సంవత్సరాలు సుస్థిరంగా కొత్వాల్ పదవిలో వెంకట్రామిరెడ్డి కొనసాగారు. వెంకట్రామిరెడ్డి పుట్టుకతోనే శ్రీమంతుడు అని గుర్తు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి.. పేద పిల్లలు చదువుకునేందుకు ఎంతో కృషి చేశారు. అవకాశాలు లేని వారి కోసం.. వారి అభివృద్ధి కోసం పాటు పడిన వ్యక్తి రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి అని కొనియాడారు.
మాయమైపోయిన మన మహనీయుల పేర్లన్నీ పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమం క్రమక్రమంగా జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రముఖుల పేర్లు చరిత్రలో నిలిచేలా చర్యలు చేపట్టామని తెలిపారు.