×

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ కాల్ సెంటర్ సేవలు

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ కాల్ సెంటర్ సేవలు

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ కాల్ సెంటర్  ద్వారా  ప్రత్యేక సేవలు అందిస్తోంది. కోవిడ్ పాజిటివ్  రోగులకు   హోం ఇసోలేషన్లో  భాగంగా తీసుకోవలసిన చర్యలు కౌన్సిలింగ్ ద్వారా  తెలియ చేస్తోంది . సాధారణ  పరిస్థితులలో  రోజు వారీ గా 17 రోజుల పాటు  కాల్ సెంటర్ నుండి నిపుణులు ఫాలో అప్ చేస్తున్నారు .మైల్డ్ లక్షణాలు వున్నా వారికీ  టెలి మెడిసిన్ కన్సల్టేషన్ ద్వారా వైద్య సలహాలు అందిస్తున్నారు . కాల్ సెంటర్ సిబ్బంది రెండు విడతలలో సుమారు 200 మంది కాల్లెర్స్ తో నిరంతరాయంగా పనిచేస్తుంది. హోం ఇసోలేషన్లో  వున్నా  సుమారు  పది వేల మంది  కోవిడ్  రోగులు తీసుకోవలసిన జాగ్రతలు, సమతూల్య ఆహారం, వారి ఆరోగ్య పరిస్థితి గూర్చి తెలుసుకోవడమే కాకుండా సలహా లు ,సూచనలు చేస్తున్నారు .

ప్రతి రోజు సుమారు ఐదు వందల మంది రోగులకు  ప్రాధాన్యత  ఆధారంగా టెలి మెడిసిన్  ద్వార వైద్య సలహా లు అందజేస్తున్నారు.ఎవరైనా కోవిడ్ బాధితులు  తీవ్రమైన శ్వాస సంబంధమైన సమస్య లేదా ఛాతి నొప్పి తో బాధపడుతుంటే వారి వివరాలను సేకరించి వెంటనే 108 ద్వారా మెరుగైన వైద్య  సౌకర్యం  అందించేందుకు ఆసుపత్రి కి తరలిస్తారు.కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ – 18005994455 . హోం ఇసోలేషన్ లో రోగి తో పాటు రోగికి సేవలు అందించేవారు తీసుకోవలసిన జాగ్రతల పై సూచనలు ఇస్తారు . కోవిడ్ కు సంబంధించి ఏమైనా సూచనలు , సలహాలు  తెలుసుకోవాలి అనుకునేవారు  కోవిడ్ కాల్ సెంటర్ కు కాల్ చేసి తమ సందేహాలను నివృతి చేసుకోవచ్చు.

print

Post Comment

You May Have Missed