*హైదరాబాద్ లో జరిగిన వేర్ హౌజింగ్ కార్పోరేషన్ బోర్డు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి *
*తెలంగాణలో సెంట్రల్ వేర్ హౌజింగ్ గోదాంల నిర్మాణానికి సహకరించండి * రైతుల పంటలన్నీ గోదాంలలో నిలువకు ఉపయోగిస్తాం * మంచి ధర వచ్చినప్పుడు, వీలయినప్పుడు అమ్ముకునే పరిస్థితి రావాలి * ముఖ్యమంత్రి కేసీఆర్ సలహా మేరకు ఇప్పటికే రూ.వెయ్యి కోట్లతో నాబార్డు ద్వారా వెచ్చించి 336 ఆధునిక గోదాంలను నిర్మించారు. * సాగునీటి ప్రాజెక్టుల రాకతో పంటల దిగుబడి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నిర్మించిన గోదాంలు సద్వినియోగం అవుతున్నాయి * కేంద్రప్రభుత్వం సెంట్రల్ వేర్ హౌజింగ్ కార్పోరేషన్ తరపున తెలంగాణలో అత్యధికంగా గోదాంలను నిర్మించాలని డిమాండ్ . * సానుకూలంగా స్పందించిన సెంట్రల్ వేర్ హౌజింగ్ కార్పోరేషన్ ప్రతినిధులు * వేర్ హౌజింగ్ కార్పోరేషన్ లో 50 శాతం చొప్పున వాటా కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు * వ్యవసాయానికి ఉచిత కరంటు, రైతుబంధు, రైతుభీమా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో భారీ ఎత్తున పెరిగిన సాగు * రానున్న రోజులలో పంటల దిగుబడి మరింత పెరగనుంది * భవిష్యత్ అవసరాల నేపథ్యంలో మరిన్ని గోదాంల నిర్మాణం తప్పనిసరి.. కేంద్రం సహకారం అందించాలి * తెలంగాణ ప్రభుత్వం తాము కోరిన జిల్లాలు, మండలాలలో స్థలాలు ధరకు కేటాయిస్తే .. తాము గోదాములు నిర్మిస్థామని సూత్రప్రాయంగా అంగీకరించిన సెంట్రల్ వేర్ హౌజింగ్ ప్రతినిధులు * సంబంధిత ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు ఆదేశం * హైదరాబాద్ లో జరిగిన వేర్ హౌజింగ్ కార్పోరేషన్ బోర్డు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్ధసారధి , వేర్ హౌజింగ్ కార్పోరేషన్ ఎండీ భాస్కరాచారి , సెంట్రల్ వేర్ హౌజింగ్ కార్పోరేషన్ జీఎం ఆర్.ఆర్.అగర్వాల్, సెంట్రల్ వేర్ హౌజింగ్ కార్పోరేషన్ రీజినల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ , సెంట్రల్ వేర్ హౌజింగ్ కార్పోరేషన్ డైరెక్టర్ డాక్టర్ ముత్తురామన్ తదితరులు హాజరయ్యారు.