తెలంగాణకే ప్రత్యేకమయిన పూల పండుగ చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన రాష్ట్రంలో ప్రకృతిమాత సహకరించడంతో విస్తృతంగా కురిసిన వర్షాల వల్ల గ్రామాల్లోని చెరువులు నీటితో నిండి జలకళ సంతరించుకున్నాయని ఈ సందర్భంగా జరుగుతన్న బతుకమ్మ తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగులు నింపుతుందని ఆకాంక్షించారు.