ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడానికి వివిధ రాష్ర్టాల ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించేందుకు కేంద్రమంత్రి ఉమాభారతి ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి సమన్వయకమిటీలో సభ్యుడిగా ఉన్న మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. సమావేశంలో హరీశ్‌రావు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఆర్థికసాయంపై ఉమాభారతితో చర్చించారు. అవసరమైన నిధులు ఏర్పాటు చేయాలనీ విజ్ఞప్తి చేసారు.