శ్రీశైల దేవస్థానం:తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కర్నూలు, మంత్రాలయములో శ్రీశైల దేవస్థానం ప్రచురణలు, గోఉత్పత్తుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసారు.
కర్నూలు నగరంలోని సంకల్ బాగ్ లో, మంత్రాలయంలో మఠానికి ఎదురుగా గల ప్రధాన రహదారిలో ఈ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసారు.
భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ విక్రయ కేంద్రాలలో దేవస్థానం ముద్రించిన వివిధ రకాల క్యాలెండర్లు, ఆధ్యాత్మిక గ్రంథాలు, శ్రీశైలప్రభ మాసపత్రిక ప్రతులు, శ్రీ స్వామివారి దివ్యపరిమళ విభూతి, శ్రీ అమ్మవారి చక్రార్చన కుంకుమ, శ్రీస్వామిఅమ్మవార్ల రక్షాకంకణాలు (కైలాసకంకణాలు) గోఆర్క్, ధూప్ స్టిక్స్, గో పంచకం, హోమ పిడకలు, ప్రమిదలు, మోబైల్ యాంటీ రేడియేషన్ స్టిక్కర్లు మొదలైన గో ఉత్పత్తులు విక్రయిస్తున్నారు.
ఈ కేంద్రాలలో శ్రీశైలప్రభ మాసపత్రిక వార్షిక, శాశ్వత చందాలు కూడా నమోదు చేస్తున్నారు.
కాగా ఈ ప్రచురణల విక్రయ కేంద్రాల నిర్వహణకు సంబంధించి కర్నూలులో పర్యాటకశాఖవారు, మంత్రాలయంలో శ్రీ
రాఘవేంద్రస్వామి మఠం వారు పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నారు.