శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం
తిరువాడిప్పూరం వైభవం
ఆముక్తమాల్యద(ఆండాళ్…గోదా దేవి)కి మెట్టినిల్లు అహోబిలం.
“అరిముగన్ అచుతన్ ఎన్ కైమేల్ కై వైత్తు పొరముగం తట్ట కణా కణ్డేన్ తోழி నాన్”(సింహ ముఖం గలిగిన అచ్యుతుడు చేయి పై చేయి ఉంచి లాజ హోమం చేసినట్లు కలగన్నాను) అంటూ తాను అహోబిల నరసింహుని పాణిగ్రహణం చేసుకున్నది.అందుకు సాక్షిగా అహోబిల క్షేత్రంలో గోదాదేవి చేతిలో చిలుకతో కాకుండా స్వామి చేతులు పట్టుకున్నట్లుగా పాణి గ్రహణ హస్తంతో దర్శమిస్తుంది.ఆమె అహోబిల దేవుని ప్రియ మహిషి.
ఆండాళ్ అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా అహోబిల క్షేత్రంలో శ్రీ ప్రహ్లాదవరదులకు ఆముక్తమాల్యద(ఆండాళ్) కు కల్యాణోత్సవం నిర్వహించారు.అనంతరం సేర్తి అరలో విరుల శయ్యమీద ఆముక్తమాల్యద కు ప్రహ్లాదవరదునకు సేర్తి జరిగినది.
Thiruvaadippooram vaibhavam
Today is Amukthamalyada (andaal) thirunakshatram.Ahobilam is the maternal house(pugunda veedu) to Amukthamalyada.
Amukthamalyada in her varanamaayiram says….
“Arimugan achuthan en kaimel kaivaithu porimugan thatta kana kanden thozhi naan”(i dreamed that lion faced permual did lajahomam by holding my hand with his hand).
Generally ,andal holds a parrot in her hand which can be seen in all other divya desam.it is only in ahobilam that andal is with PAANIGRAHANA HASTHAM Amukthamalyada is priya mahishi of Ahobila deva.
As a part of thiru vaadi pooram utsavam,kalyanothsavam is performed followed by serthi to andal and sri Prahladavarada.