తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాజధానిలో శ్రీవారి ఆలయం నిర్మిస్తుండటంతో కార్యాయలం ఏర్పాటు చేయాలని సీఎంను కోరినట్లు చెప్పారు. ప్రత్యేకంగా చైర్మన్ క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు కోరలేదని వివరించారు. దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదని పేర్కొన్నారు. దేవుడి సొమ్ము ఒక్క రూపాయిని కూడా తాకనని, అవసరమైతే తానే పది మందికి సాయం చేస్తానని పునరుద్ఘటించారు.