తిరుమల, 2021 జనవరి 31: దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంజరిగింది. టిటిడి ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఎబి.నర్మద పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.
తిరుమలలో 25 ప్రాంతాలలో పల్స్‌పోలియో కేద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో శ్రీవారి ఆలయంతో కలిపి 21 ప్రాంతాలలో భక్తులకు, 4 ప్రాంతాలలో స్థానికులకు ఏర్పాటు చేశారు. ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు జరిగే పల్స్‌పోలియో కార్యక్రమంలో భక్తులు, స్థానికులు 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు విధిగా పల్స్‌పోలియో చుక్కలు వేయించారు.
అశ్విని ఆసుపత్రి, జియన్‌సి, ఆర్‌టిసి బస్టాండ్, సిఆర్‌ఓ, పిఏసి 1 , 2, ఎమ్‌బిసి-34, వైకుంఠం 1 , 2, హెల్త్ ఆఫీసు, ఎటిసి, మేదరమిట్ట, వరాహస్వామి, రాంభగీఛ అతిధి గృహలవద్ద, శ్రీవారి ఆలయం సమీపంలో , కల్యాణకట్ట, బాలాజీ నగర్, టిటిడి ఉద్యోగుల డిస్పెన్సరి ఎస్.వి. హైస్కూల్, పాపావినాశనం, అలిపిరి కాలినడక మార్గంలో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఎంవో డా|| ఆర్వీఎస్.మురళీధర్, మెడికల్ సూపరింటెండెంట్ డా|| కుసుమకుమారి, ఇతర డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.