తిరుప్పావై వైభవం -7 courtesy; kidambi sethu raman, photo: great creator

కీశు కీశెన్రెజ్ఞ్గుమానై చాత్తకలన్దు !
పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయో ! పేయ్ ప్పెణ్ణే !
కాశుమ్ పిరప్పుమ్ కలగలప్పక్కై పేర్తు
వాశ నరుజ్ఞ్గుళ లాయిచ్చియర్ మత్తినాల్
ఓశై పడుత్త తయిర రవమ్ కేట్టిలైయో
నాయకప్పెణ్ణిళ్ళాయ్ ! నారాయణన్ మూర్తి
కేశావనై ప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో
తేశ ముడైయాయ్ ! తిర వేలో రెమ్బావాయ్.

అర్థం:
చక్రవాక పక్షులు, పగలు విడిపోతామని తెల్లవారుజామున మాట్లాడుకుంటున్నాయి.ఆ పక్షుల మాటలు అంతటా వ్యాపించి  ఉన్నాయి. ఓ పిచ్చిదానా! నీవు ఆ పక్షులు చేయు శబ్దములు వినలేదా? పూలతో అలంకరించబడిన కొప్పువీడుటచే సుగంధములు వెదజల్లు కేశములు గల గోపికలు కవ్వముతో పెరుగును చిలికినప్పుడు వారి చేతి కంకణ రవములు,ఆభరణములు చేయు శబ్దములు అంతటా వ్యాపించాయి . ఆ శబ్దములు నీవు వినలేదా?
ఓ నాయకులారా! నారాయణ మూర్తిని,కేశవుని మేము కీర్తించుట నీవు వినలేదా?లేక విని కూడా నీవు నిద్రిస్తున్నవా?నీ తేజస్సు మాకు కనబడుతోంది  . మమ్మల్ని అడ్డుకోకుండా తలుపు తీయవమ్మా!!

విశేష అర్థము :భగవత్  గుణ అనుభవంతో  కలిగిన  జ్ఞానము వృధా కారాదు. అడవిగాచిన వెన్నెల కారాదు,  ఇతరులు అనుభవించి  తమ అజ్ఞానము  పోగొట్టుకోడానికి ఉపయోగపడాలి.

print

Post Comment

You May Have Missed