తిరుప్పావై వైభవం -5 courtesy; Kidambi sethu raman
5వ పాశురం: 19.12.2017 – పరమాత్ముని కీర్తన ,ధ్యానంతో పాప రాశి భస్మం
మాయనై మన్ను, వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్రుమ్ మణి విళక్కై
త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వన్దునామ్ తూమలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి, మనత్తినల్ శిన్దిక్క
పోయపిళ్ళైయుమ్ ప్పుగుదరువా నిన్రనవుమ్
తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్
అర్థం:
మాయవిని, ఉత్తర దేశములోని మధుర నగరము పాలించు వాని,యమునా నదిని తనకు విలాసముగా గలవాని,గోపకులం లో వెలుగుతున్న మంగళ దీప జ్యోతి స్వరూపిని , తల్లి కట్టిన త్రాడుకు బందీ అయిన దామోదరుని, శ్రీ కృష్ణుని పుష్పములు సమర్పించి,నోటితో కీర్తించి,మనస్సున ధ్యానించి అర్చించడం చేత ఈ జన్మలోనే కాక పురాకృత పాపములన్నియు అగ్ని యందు వేయబడిన దూదివలె భస్మమ కాగలదు.
అంతరార్థం:
ఇంతకు ముందు పాశురాలలో ఆండాళ్ గోపికలను శ్రీ కృష్ణారాధనకై నిద్రమేల్కొని,స్నానమాచరించి రమ్మని తెలిపింది.
అయితే కొంత మంది తాము అనేక పాపములు చేశామని,గత జన్మల పాప ఫలమును అనుభవిస్తున్నామని కాబట్టి తాము భగవంతుని పొందుటకు అర్హులకు కర్మాణి సందేహించారు.అయితే ఏడేడు జన్మల పాపములు కూడా శ్రీ కృష్ణుని అర్చించి ధ్యానించుటచే అగ్నిలో దూది వేసినప్పుడు, అది ఎలాగైతే కాలిపోయి భస్మమవుతుందో, అలాగే మన పాప రాశి నశిస్తుందని తెలిపారు.
ఆండాళ్ తిరువడిగలే శరణం
ఆదిగురు తిరువడిగలే శరణం
Post Comment