అంతిమ ప్రయోజనం లోకక్షేమమే
18.12.2017…..మూడవ పాశురం
ఓంగి యులగళన్ద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్బావైక్కు చ్చాట్రి నీరాడినాల్
తీంగన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయ్ దు
ఓంగు పెరుమ్ శెన్నెల్ ఊడు కయలుగళ
పూంగువళై పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరున్దు శీర్ త్తములై పట్రి
వాంగక్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్బశుక్కళ్
నీంగాదశెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్.
అర్థం:
మూడడుగులతో సకల లోకములను కొలిచిన ఉత్తముడైన త్రివిక్రముని పాదములను పాడెదము.అందుకొఱకు మనం చక్కగా స్నానామాచరించవలెను. ఆ పరమాత్ముని కీర్తించడం చేత సకాలంలో నెలకు మూడు వర్షాలు పడతాయి.పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి.కొనేటిలో చేపలు తుళ్ళిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి.భ్రమరములు మకరందాన్ని గ్రోలి మత్తుగా నిదురిస్తాయి. గోవులు తమ పొదుగులను తాకగానే బిందెలు నిండునట్లుగా పాలను ధారాళంగా ఇస్తాయి.ఎప్పటికి తరగని సంపద లభిస్తుంది.
అంతరార్థం:
ఈ పాశురంలో ఆండాళ్ ఈ ధనుర్మాస వ్రతమును ఆచరించడం చేతను,స్వామిని ఆరాధించడం చేత కలిగే ఫలితాలను వివరిస్తుంది.
భగవదారాధనకు అంతిమ ప్రయోజనం లోకక్షేమమే.
ఎప్పుడైతే భగవంతుణ్ణి స్తుతిస్తామో అప్పుడు లోకములో అన్ని సమృద్ధిగా ఉంటాయి.ఇహ లోక సుఖమే కాక పరలోక సుఖమును కూడా లభిస్తుంది.ఈ పాశురం లో పేర్కొన్న ఎన్నటికీ తరగని సంపద అంటే ముక్తైశ్వర్యమే. భగవంతుని కైంకర్యమే మనకు ఎన్నటికీ తరగని సంపద.
ఆండాళ్ తిరువడిగలే శరణం
ఆదిగురు తిరువడిగలే శరణం