27వ పాశురం
కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా! ఉన్దన్నై
పాడి ప్పఱై కొణ్డు యాం పెఱు శమ్మానమ్,
నాడు పుగళుమ్ పరిశినాల్ నన్ఱాక
చ్చూడగమే, తోళ్ వళై యే, తోడే, శెవిప్పూవే,
పాడగమే, యెన్ఱనైయ పల్ కలనుమ్ యామణివోమ్,
ఆడై యుడుప్పోమ్; అదన్ పిన్నే పాల్ శోఱు
మూడ నెయ్ పెయ్ దు ముళఙ్గై వళివార
క్కూడి యిరున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్
*నీతో కూడని వారిని, నిన్ను వ్యతిరేకించేవారిని, నీపట్ల విముఖులను జయించేవాడా! గోవిందుడు అనెడి నామము గలవాడా, కళ్యాణగుణములు గలవాడా! నిన్ను కీర్తించి, వ్రతసాధనమగు ‘పరను’పొంది, నీతో మేము పొందదలచిన సన్మానము లోకులు అందరూ పొగిడేలాగా ఉంటుంది. మా కరములకు దివ్యములైన గాజులు, మా బాహువులకు కంకణములు, మా చెవులకు కమ్మలు, బంగారు చెవిపూవులు, మేలైన చీరలు, రవికలు, కాలికి ఘల్లుమనే మువ్వలను నీవు ప్రసాదించాలి. పాలతోవండిన దివ్యాన్నములపై నేతి వర్షములు కురిపించి చేసిన ప్రసాదమును, క్షీరాన్నమును నీ సరసన ఘనముగా కూర్చుండి, మా మోచేతులమీదుగా ధారలుగా కారుతుండగా ఆ పాయసాన్ని త్రాగాలి! యిదే మా వ్రతఫలితముగా మేము పొందేట్లు వరమివ్వు స్వామీ!