20వ పాశురము; స్వరూపజ్ఞాన కాంతికి దర్పణం
- ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్రు
కప్పమ్ తవిర్కుమ్ కలియే తుయిలెళాయ్
శెప్పముడైయాయ్ తిఱలుడైయాయ్ ! శెట్రార్కు
వెప్పమ్ కొడుక్కుమ్ విమలా తుయిలెళాయ్
శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిరు మరుంగుల్
నప్పిన్నై నంగాయ్ ! తిరువే ! తుయిలెలాయ్
ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై
ఇప్పోదే యెమ్మై నీరాట్టేలే రెమ్బావాయ్.
*ముప్పై మూడు కోట్ల దేవతలకు కష్టం
రావడానికంటెముందే వెళ్లి వారిని రక్షించే బలవంతుడా! నిద్ర మేలుకోవయ్య.
ఆడిన మాట తప్పని సత్యవాక్పాలక! నిద్ర మేలుకో.
శత్రువులకు భీతి కలిగించి ఓటమి జ్వరము ఇచ్చే విమలుడా! లేయవయ్య.
బంగారు కలశములను పోలిన స్తనములు, దొండపండు వలె ఎర్రని పెదవియును, సన్నని నడుమును కల ఓ నీలాదేవి! పరిపుర్ణురాలా! లక్ష్మీ సమానురాలా! మేలుకొనుము. వీచుటకు ఆలవట్టమును, కంచుటద్దమును అందించి నీ వల్లభుడగు శ్రీ కృష్ణునితో కలసి మేము స్నానము చేయునట్లు చేయుము.