తిరుప్పావై వైభవం-15 COURTESY:KIDAMBI SETHU RAMAN, PHOTO: GREAT CREATOR
15 వ పాశురము
ఎల్లే యిలంగిళియే ! యిన్నమురంగుడియో?
శిల్లెన్రళై యేన్మిన్? నజ్ఞ్గైమీర్, పోదరుగిన్రేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పణ్డేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీజ్ఞ్గళే, నానేదా నాయుడుగ
ఒల్లైనీ పోదాయ్, ఉనక్కెన్న వేఱుడైయై ?
ఎల్లారుమ్ ఫోన్దారో? ఫోన్దార్, ఫోన్దెణ్ణిక్కొళ్
వల్లానై కొన్రానై మాత్తారై మాత్తళిక్క
వల్లానై మాయనై ప్పాడేలో రెమ్బావాయ్.
ఇంతవరకు తొమ్మిదిమంది గోపికలని మేల్కొల్పినారు. పదవ గోపికను ఈ పాశురములో మేల్కొల్పుతున్నారు. దీనితో ముందు భాగము పూర్తవుతుంది. దీనిలో ముందుగా భగవ్ద్భక్తులను మేల్కొల్పుతారు. తరువాత భగవానుని మేల్కొల్పుతారు. మొదటి 15 పాశురాలలో మొదటి ఐదు పాశురాలచేత ఈ వ్రతమునకు పుర్వరంగమును తెలియజేసి తరువాత పది పాశురాలలో పది మంది గోపికలను మేల్కొల్పినారు . దీనితో భగవద్ ఆలయములో చేరుకొనుటకు అర్హత కలిగెను. ఇంతవరకు భగవద్భక్తుల విషయములో అనుసరించవలసిన విధానములను నిరూపించి, ఈ పాశురములో దాని ఫలమును నిరుపించబడుచున్నది. ఇంతవరకు భగాత్ప్రాప్తికి చేయవలసిన సాధన క్రమము వివరించారు గోదాదేవి.
ఈ పాశురము న లోపలఉన్న గోపికకు, బయటి గోపికలకు సంవాదము ప్రత్యేకం . వారి మధ్య సంభాషణ ఎలావుందంటే……………..
బయటి గోపికలు: ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్ర పోతున్నావా ? అయ్యో ఇది ఏమి ?
లోపల ఉన్న గోపిక: పూర్ణులగు గోపికలారా ! చికాకు కలుగునట్లు జిల్లుమని పిలువకండి.
బయట ఉన్న గోపుకలు: నీవు చాలా నేర్పు కలదానవు. నీమాటలలో నైపుణ్యము, కాఠిణ్యము మాకు ముందే తెలియును.
లోని గోపిక : మీరే నేర్పు కలవారు. పోనిండు ! నేనే కఠినురాలను.
బయట ఉన్న గోపికలు : నీకీ ప్రత్యేకత ఏమి? అట్లు ఏకాంతముగా ఎందుకు వుంటావు. వేగముగా బయటకు రా !
లోని గోపిక: అందరు గోపికలు వచ్చినారా.
బయటి గోపికలు: వచ్చిరి , నీవు వచ్చి లెక్కించుకో .
లోని గోపిక: సరే , నేను వచ్చి ఏమి చెయ్యాలి ?
బయటి గోపికలు: బలిష్టమగు కువలయాపీడము అను ఏనుగును చంపినవాడను, శత్రువుల దర్పమును అణచినవాడను , మాయావి అయిన శ్రీ కృష్ణుని కీర్తిని గానము చేయుటకు రావమ్మా!!
ధ్వని : భరతుని మాదిరిగా ఇతరుల దోషములను కూడా తమ దోషములుగా ఆరోపించుకొను వారి తీరుకు దర్పణం
Post Comment