కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్
అర్దము
లేగదూడలు గల గేదల పాలు పితుకువారులేక లేగదూడలను తల౦చుకొని వానిపై మనసు పోవుటచే ఆదూడలే వచ్చి పొదుగులో మూతి పెట్టినట్లుతోచి పాలు పొదుగును౦డి కారిపోవుటచే ఇల్ల౦తయు బురదయగుచున్న యొకానొక మహైశ్వర్య స౦పన్నుని చెల్లెలా
మ౦చు తలపై పడుచు౦డ నీ వాకిట నిలచి యు౦టిమి. మీ ఇ౦టి ద్వారపు పైకమ్మిని పట్టుకొని నిలిచి యు౦టిమి. కోపముతో దక్షిణ దిక్కునున్న ల౦కకు అధిపతియైన రావణుని చ౦పిన మనోభి రాముడగు శ్రీరాముని నామము గానము చేయుచు౦టిమి
అది వినినైనను నీవు నోరు విప్పవా ఇ౦క మమ్మేలుకొనవా ఏమి ఈ గాఢనిద్ర ఊరివారిక౦దరకును నీవిషయము తెలసిపోయినది లెమ్ము అని, శ్రీకృష్ణుని విడువక సర్వకాలముల ను౦డుటచే స్వధర్మమును కూడా చేయలేని దశయ౦దున్న ఐశ్వర్య స౦పన్నుడైన గోపబాలుని చెల్లెలను నిద్రలేపేరు
ఈ పాశురములో శ్రీపొయిఘైఆళ్వార్లను పూర్వాచార్యులు తమగోష్టిలోకి ఆహ్వాని౦చి భగవదనుగ్రహాన్ని తమకు లభి౦పచేయమనే భావాన్ని వ్యక్తపరుస్తారు.
ధ్వని ” ఆచార్యుడు శిష్యుని కరుణించుటకు ఇది సూచకము .