తిరుప్పావై వైభవం 11 courtesy: kidambi sethu raman, photo: great creator

కట్రుక్క ఱ వైక్కణంగళ్ పలక ఱన్దు
శట్రార్ తి ఱలళియచ్చెన్రు శెరుచ్చెయ్యుమ్
కుట్రమొన్రిల్లాద కోవలర్తమ్ పొర్కొడియే
పుట్రరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుట్రత్తుతోళిమా రెల్లారుమ్ వన్దునిన్
ముట్రమ్ పుహున్దు ముగిల్వణ్ణన్ పేర్పాడ
శిట్రాదే పేశాదే శెల్వప్పెణ్ణాట్టి ! నీ
ఎట్రుక్కు రంగమ్ పొరుళేలో రెమ్బావాయ్.

ఈ పాశురంలో ఆండాళ్ గుణము చేతను,సంపద చేతను సంపన్నురాలైన గోపికను నిద్ర లేపుతున్నది.
: అర్థం:
లేగ దూడలు గల ఆవుల మందలనెన్నిటిలో పాలు పితుకువారును,శత్రువులను ఎదురించి యుద్ధం చేయగలవారును,ఎటువంటి దోషము లేని వారగు గోపాలకుల కులమునకు శ్రేష్టురాలా!పుట్టలో పాము వాలే నితంబ ప్రదేశము గల ఓ బంగారు మెరుపు తీగ!చెలులందరము నీ ఇంటివాకిట చేరి నిలిచి,శ్రీ కృష్ణుని నామము కీర్తిస్తున్నాము.కీర్తిస్తున్నా ఉలకవేమి?ఓ సంపన్నురాల ఇక నిద్ర మేలుకో!

print

Post Comment

You May Have Missed