న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కొద్ది సేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన సీఎం సాయంత్రం దేశ రాజధానిలో అడుగుపెట్టారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం వైయస్ జగన్ భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఆయన అమిత్ షాతో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వైయస్ అవినాష్‌రెడ్డి ఉన్నారు.
టీమిండియాకు వైయస్ జగన్ అభినందనలు:
ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 3 వికెట్ల తేడాతో స్టన్నింగ్ విజయం సాధించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జట్టుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ట్విటర్ వేదికగా టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘హార్టీ కంగ్రాట్స్ టీమిండియా.. ఇది నిజంగా గొప్ప విజయం. ప్రధాన ఆటగాళ్ల గైర్హాజరీలో మూడు దశాబ్దాల తర్వాత గబ్బా వేదికగా టీమిండియా విజయం సాధించి చరిత్రను తిరగరాసింది. మ్యాచ్‌లో మీరు కనబరిచిన అద్భుత ప్రదర్శన పట్ల ఈరోజు దేశం మొత్తం గర్విస్తుంది.’ అని తెలిపారు.