ఢిల్లీలో జరుగుతున్న సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సమావేశానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హాజరయ్యారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. విద్యాబోధనలో ఫలితాలను పెంపొందించడం, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను హేతు బద్ధీకరించడంతో పాటు అంగన్ వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానించడంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.