తెలంగాణ రాష్ట్ర బి.సి.కమిషన్ సభ్యులు డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు జన్మ దినాన్ని పురస్కరించుకొని , కళాపీఠం ట్యూన్స్, శ్రీత్యాగరాయగానసభ, తెలుగువెలుగు కల్చరల్ అసోసియేషన్, కీర్తనా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా గానసభ కళాలలిత కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు “బహుజన బంధు” బిరుదు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.
శంకరం వేదిక అధ్యక్షులు యలవర్తి రాజేంద్రప్రసాద్, గానసభ అధ్యక్శులు లయన్ కళా జనార్దనమూర్తి, సెన్సార్ బోర్డు సభ్యులు చంద్రశేఖర్, సంగీత గురు శివపార్వతి, లయన్ శ్రీరామ్ దత్తి, మల్లెల సుధాకర్, కళావైభవం కె.ఎల్. నర్సింహారావు అతిథులుగా పాల్గొని డా. వకుళాభరణం సామాజిక సేవలను కొనియాడారు.ఈ బిరుదును అందుకోవడం ఆనందంగా ఉన్నదని డా. వకుళాభరణం స్పందించారు.సభకు ముందు బాల సచ్చిదానందం చిన్నారుల సంగీత నృత్య కదంబం,మల్లెల మిమిక్రి ఆకర్షణగా నిలచింది.కళాపీఠం ట్యూన్స్ అధ్యక్షులు,సీనియర్ పాత్రికేయులు రత్నాకర శర్మ సభకు సమన్వయం చేశారు.