టోర్నమెంట్‌ను రద్దు చేయాలని కోరుతూ పిల్ –  courtesy: బీవీ , హైదరాబాద్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ మరో మూడు రోజుల్లో ప్రారంభంకానున్న వేళ టోర్నీకి  ఒక వ్యతిరేక  అంశం ఎదురైంది .

ఈ టోర్నమెంట్‌ను రద్దు చేయాలని జీ.సంపత్‌కుమార్ అనే ఐపీఎల్ అధికారి మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

 ముంబై హైకోర్టు బీసీసీఐకి నోటీసులు జారీ చేసింది.

ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ వంటి ఘటనలు గతంలో జరిగాయని, ఈ సీజన్‌లో కూడా అవి జరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని వెంటనే నిలిపివేయాలని పిల్‌లో కుమార్ పేర్కొన్నారు.

‘‘లోధా కమిటీ నివేదికలకు విరుద్ధంగా ఇప్పటికే ఐపీఎల్‌లో స్వార్థ ప్రయోజనాల కోసం చేసే పనులను ఇంకా కొనసాగుతునే ఉన్నాయి’’ అని కుమార్ పేర్కొన్నారు.

అంతేకాక బీసీసీఐలో మ్యాచ్ ఫిక్సింగ్‌లను కట్టడి చేసేందుకు సరైన వ్యవస్థ లేదని కుమార్ ఆరోపించారు.

2013లో జరిగిన ఐపీఎల్ స్కామ్ కేసు విచారణ అధికారుల్లో కుమార్ ఒకరు.

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ, టీం అధినేత గురునాథ్ మీయప్పన్ కిట్టి అనే బుక్కీతో చట్టవిరుద్ధమైన ఒప్పందాలు చేసుకున్నారన్న అంశాన్ని  వెలుగులోకి తెచ్చింది కుమారే.

అయితే ఆ తర్వాత  వివిధ కారణాలతో    కుమార్‌పై వేటు పడింది.

ఇప్పుడు ఈ పిల్ వేయడంతో కుమార్ మరోసారి వెలుగులోకి వచ్చారు. మరి దీనిపై బీసీసీఐ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
* ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది.

గత సీజన్లతో పోలి స్తే..  ఈ ఏడాది ఐపీఎల్ మరింత వైభవంగా.. మరింత పోటాపోటీగా జరుగనుంది.

ఇప్పటికే ఎనిమిది ఫ్రాంచైజీలు ఈ టోర్నీని దక్కించుకొనేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాయి.

అయితే ఇండియాలోనే అతి పెద్ద టెలివిజన్ ఈవెంట్ అయిన ఐపీఎల్ ఏ దేశంలో, ఏ ఛానల్‌లో ప్రసారమవుతుందనే వివరాలను బోర్డు వెల్లడించింది.

ఈ ఏడాది భారత ఉప ఖండంలో ఐపీఎల్ ప్రసార హక్కులను సోనీ టీవీ నుంచి స్టార్ టీవీ దక్కించుకుంది.

కాగా ఈ సీజన్ నుంచి పలు ప్రాంతీయ భాషల్లోనూ ఐపీఎల్ ప్రసారం కానుంది.

ఇంగ్లీష్‌లో స్టార్‌స్పోర్ట్స్-1, హెచ్‌డీ, స్టార్‌స్పోర్ట్స్-2, హెచ్‌డీ, హిందీలో స్టార్‌స్పోర్ట్స్-1 (హిందీ), స్టార్‌స్పోర్ట్స్-2 (హిందీ), తమిళంలో స్టార్‌స్పోర్ట్స్ (తమిళ్), కన్నడలో సువర్ణ ప్లస్‌, బెంగాళీలో జల్షా మూవీస్ (ఎస్‌డీ), తెలుగులో మా మూవీస్ ఛానల్‌లో ఐపీఎల్ ప్రసారం కానుంది. కాగా డిజిటల్ మాద్యమంలో ఐపీఎల్ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతుంది.

ఇతర దేశాల వివరాలు: (ప్రాంతం: టీవీ – డిజిటల్)

అమెరికా : విల్లో – హాట్‌స్టార్

కెనడా: విల్లో – హాట్‌స్టార్

కరేబియన్: ఫ్లో టీవీ – ఫ్లో టీవీ.కామ్, ఫ్లో టీవీ స్పోర్ట్స్ యాప్

యూకే: స్కై స్పోర్ట్స్ – స్కైస్పోర్ట్స్.కామ్, స్కైగో

సబ్ షెహ్రాన్ ఆఫ్రికా: సూపర్ స్పోర్ట్ – సూపర్‌స్పోర్ట్.కామ్, సూపర్ స్పోర్ట్ యాప్

MENA: బీఈఐఎన్ స్పోర్ట్ – బీఈఐఎన్ కనెక్ట్

పాకిస్థాన్: జియో సూపర్ – జియోసూపర్.టీవీ, జియో.కామ్

బంగ్లాదేశ్: ఛానల్ 9 – ఛానల్ 9

ఆస్ట్రేలియా: ఫాక్స్ స్పోర్ట్స్ – ఫాక్స్‌స్పోర్ట్స్.కామ్.ఏయూ, ఫాక్స్ టెల్ గో

ఆస్ట్రేలియా, యూరోప్, దక్షిణాసియా, సౌత్ ఆమెరికా:  – యప్ టీవీ

న్యూజిలాండ్: స్కై స్పోర్ట్స్ – స్కైగో.కో.ఎన్‌జెడ్, ఫ్యాన్‌పాస్.కో.ఎన్‌జెడ్, స్కై.కో.ఎన్‌జెడ్

ఆఫ్గానిస్థాన్: లెమార్ టీవీ.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.