×

టెన్త్ పరీక్షల్లో విజయానికి సిద్ధం కావాలి -గంపా నాగేశ్వర్

టెన్త్ పరీక్షల్లో విజయానికి సిద్ధం కావాలి -గంపా నాగేశ్వర్

టెన్త్ పరీక్షల్లో విజయం సాధించటానికి మానసికంగా విద్యార్థులు సిద్ధం కావాలని సూచిస్తున్న ప్రముఖ వ్యక్తిత్వ వికాసం నిపుణుడు గంపా నాగేశ్వర్. వ్యక్తిత్వ వికాసం శిక్షణా తరగతులకు హాజరైన టెన్త్ విద్యార్థులు. – చైతన్య, గజ్వేల్.

*సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్, సిద్దిపేట క్లబ్బుల ఆధ్వర్యంలో టెన్త్ విద్యార్థులకు మానసిక వికాస శిక్షణా తరగతును నిర్వహించారు. గజ్వేల్ మండలంలోని ప్రభుత్వ హైస్కూళ్ల విద్యార్థులు హాజరైన ఈ తరగతులకు ప్రముఖ వ్యక్తిత్వ వికాసం నిపుణుడు గంపా నాగేశ్వర్ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంచేవిధంగా ప్రసంగించారు.వారిలో పరీక్షలంటే ఉండే భయాన్ని తొలగిస్తూనే,ఎలా సిద్ధం కావాలో విద్యార్థులకు వివరించారు. సునాయాసంగా పరీక్షలు రాయగలమనే స్థైర్యాన్ని విద్యార్థుల్లో నింపటానికి ఆయన తనదైన శైలిలో వివరించారు.

print

Post Comment

You May Have Missed