టీయూడబ్ల్యుజే-ఐజెయు వినతి పత్రంపై ప్రభుత్వానికి ప్రతిపాదన అందిస్తా – మెట్రో రైలు ఎండి హామీ

టీయూడబ్ల్యుజే-ఐజెయు వినతి పత్రంపై ప్రభుత్వానికి ప్రతిపాదన అందిస్తా –         మెట్రో రైలు ఎండి హామీ

మెట్రో రైలు ప్రాజెక్టు పనుల నిర్మాణ విషయంలో ఎంతో తోడ్పాటును అందించిన జర్నలిస్టులకు మెట్రో రైలులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యుజే – ఐజెయు), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూ జే )లు కోరాయి. శుక్రవారం నాడు టీయూడబ్ల్యుజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ నేతృత్వంలో మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.వి.ఎస్. రెడ్డికి వినతి పత్రాన్నిఅందించారు. అక్రిడెట్ జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించడానికి ఇప్పటికే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు కల్పించాయని, అలాగే అక్రిడెట్ జర్నలిస్టులకు ఎంతోకాలంగా గ్రేటర్ హైదరాబాదులో ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని ఆర్టీసి కల్పించిందని పెర్కొన్నారు. అదేమాదిరిగా మెట్రో రైల్ లో అక్రిడెట్ జర్నలిస్టులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రాజేష్ , హెచ్ యూ జె కార్యదర్శి శిగ శంకర్ గౌడ్ , ఉపాధ్యక్షుడు కె.గోపినాథ్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం కార్యదర్శి ఎన్. మధు, ప్రచార కార్యదర్శి సాగర్, హెచ్ యూ జె నాయకులు పాండు తదితరులు పాల్గొన్నారు .

 

ప్రభుత్వానికి ప్రతిపాదన అందిస్తా – ఎండి హామీ
——————————————-
వినతి పత్రంపై హెచ్.ఎం. ఆర్.ఎల్. మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.వి.ఎస్ రెడ్డి స్పందిస్తూ అక్రిడెట్ జర్నలిస్టులకు మెట్రో రైలు ఉచిత ప్రయాణానికి సంబంధించి తన నుండి ప్రభుత్వానికి

<
>
print

Post Comment

You May Have Missed