‘టిట్లి’ తుపాన్ సహాయ చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్,
పాల్గొన్న జిల్లా కలెక్టర్లు,రెవిన్యూ,పోలీసు,వి పత్తు శాఖల అధికారులు,
తుపాన్ ప్రభావం శ్రీకాకుళం,విజయనగరం జిల్లాలపై అధికంగా ఉంటుంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
ఈ అర్ధరాత్రి 2గం నుంచి ఉదయం 5.30గం లోపు తీరాన్ని తుపాన్ తాకనుంది.
ప్రస్తుతం విశాఖపట్నానికి 200కి.మీ దూరంలో ఉంది.
13కి.మీ వేగంతో తుపాన్ కదుల్తోంది.మరో 8గంటల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది.
శ్రీకాకుళం పట్టణం వద్ద తుపాన్ తీరాన్ని తాకే అవకాశం ఉంది.తరువాత విజయనగరం వైపు కదులుతుందని అంచనా.
శ్రీకాకుళం జిల్లాలో రాత్రి 11గం నుంచి కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది.
ఈదురుగాలులు గంటకు 120కి.మీ వేగంతో వీచే ప్రమాదం ఉంది.
ఇప్పటికే సోంపేట,కోటబొమ్మాళి,శ్రీకాకుళం లో భారీవర్షాలు
ఆస్తినష్టం నియంత్రించాలి.జననష్టం నివారించాలి
ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. శిబిరాలలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలి.భోజనం,తాగునీరు పంపిణీ చేయాలి
హుద్ హుద్ తుపాన్ ఎదుర్కొన్న స్ఫూర్తి అందరిలో రావాలి
ఇదొక పరీక్ష,దీనిని ఎలా ఎదుర్కొన్నామో తరువాత ఫలితాలు వెల్లడిస్తాయి
మత్స్యకారులు వేటకు వెళ్లకుండా హెచ్చరించాలి.
బస్సుల రాకపోకలు నిలిపేయాలి. విద్యుత్ సరఫరాను నిలిపేయాలి.
కాలువలకు నీటి విడుదల నిలిపివేయాలి. గండ్లు పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి
విపత్తు నిర్వహణ,రెవిన్యూ,పోలీస్,అగ్ని మాపక శాఖలు అప్రమత్తంగా ఉండాలి
విద్యుత్,పంచాయితీ రాజ్,ఆర్ అండ్ బి,వైద్య సిబ్బంది సంసిద్దంగా ఉండాలి
జిల్లా కేంద్రాలు,మండల కేంద్రాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలి. రియల్ టైమ్ గవర్నెన్స్ తో సమన్వయం చేసుకోవాలి.
తాగునీటి కాలుష్యం కాకుండా చూడాలి.
బ్లీచింగ్,క్లోరిన్ టాబ్లెట్లు సిద్దం చేసుకోవాలి
వైద్యులు,ఆరోగ్య సిబ్బంది 24గం అందుబాటులోకి ఉంచాలి
ఎన్ డిఆర్ ఎఫ్,ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలను పొజిషన్ చేయాలి
తాగునీటి కొరత లేకుండా చూడాలి.జనరేటర్లు సిద్ధం చేసుకోవాలి.
ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక మొబైల్ వాహనాన్ని సిద్దంగా ఉంచాలి
జిల్లాలో 43పోలీస్ స్టేషన్లు అప్రమత్తంగా ఉండాలి
చెట్లు పడిపోతే వెంటనే తొలగించాలి.కరెంటు స్థంభాలను వెంటనే నిలబెట్టాలి.
కట్టర్లు,కరెంట్ పోల్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. రాత్రి తెల్లవార్లు అందరూ అప్రమత్తంగా ఉండాలి.గంటగంటకు వివరాలు తెలియజేయాలి
తుపాన్లు ఎదుర్కోవడంపై పూర్తి సన్నద్దత రావాలి. మన పరిజ్ఞానం,సాంకేతికత సద్వినియోగం చేసుకోవాలి
తుపాన్ ఎంత వేగంతో కదుల్తోంది,ఎటువైపు నడుస్తోంది,ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలి.వాటిని బట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.