జిల్లెలగూడ శ్రీ వేంకటేశ్వర స్వామి  ఆలయంలోఘనంగా గోదా కళ్యాణం

జిల్లెలగూడ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి  ఆలయంలో గోదా కళ్యాణం ఘనంగా జరిగింది , తిరుప్పావై ప్రవచనాలు , భక్తి గాన కార్యక్రమాలు  విజయవంతంగా  ముగిశాయి .  తెలంగాణ భాషా ,సాంస్కృతిక శాఖ సహకారంతో, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళా శాసనములతో  కార్యక్రమాలు జరిపారు .   వద్దిరాజు  జనార్ధన రావు ఆధ్వర్యం వహించారు . భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అర్చక స్వాములు శ్రద్దగా పూజా కార్యక్రమాలు జరిపారు . శ్రీమాన్ డింగరి రామాచార్యుల వర్యవేక్షణలో గోదాదేవి, రంగనాధస్వామిల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.భాస్కరభట్ల ఆంజనేయశర్మ  తిరుప్పావై  ప్రవచనం చేసారు . సిద్దాల దశరధ,  తోట వంశీకృష్ణ,  ప్రముఖులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ కె.ఎల్. నరసింహా రావు,  వేముల రాజేశ్వర రావు సమన్వయం చేసారు . తిరుప్పావై, భక్తి గాన గోష్ఠి కార్యక్రమాలలో పాల్గొన్న భక్తులకు, కార్యక్రమానికి విచ్చేసిన ఇతర ప్రముఖులకు ప్రశంసా పత్రాలు అందచేసి శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా పాల్గొన్న ప్రముఖ రచయిత్రి డా. మంగళగిరి ప్రమీలాదేవి. శ్రీ బద్దం శ్రీనివాస్ రెడ్డి , శ్రీమతి లక్ష్మమ్మ, ప్రముఖ సినీ దర్శకులు శ్రీ గోపాల కృష్ణ పాల్గొన్నారు .వికాస తరంగిణి మీర్పేట్ సహకారంతో భక్తి గోష్ఠి గానం కార్యక్రమాల భాగంగా  శ్రీమతి సువర్ణకుమారి , శ్రీమతి లావణ్యా బృందం పాడిన భజన, భక్తి గీతాలు భక్తులను అలరించాయి .

print

Post Comment

You May Have Missed