జిల్లెలగూడ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు , భక్తి గోష్ఠి గానం కార్యక్రమాలు జరుగుతున్నాయి
శ్రీమాన్ డింగరి రామాచార్యుల ప్రత్యేక వర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 20 వ తేదీన గౌరవ అతిథి గా విచ్చేసిన సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ www onlinenewsdiary.com కోవూరు హనుమంత రావు , వికాస తరంగిణి అధ్యక్షులు తోట వంశీకృష్ణ లను శ్రీమాన్ డింగరి రంగాచార్యులు ఘనంగా సత్కరించారు. ఉపన్యాసం ప్రారంభించే ముందుగా శ్రీ భాస్కరభట్ల ఆంజనేయశర్మను సన్మానించారు .
ప్రవచన కార్యక్రమం ముందుగా శ్రీమతి సువర్ణకుమారి బృందం, శ్రీమతి లావణ్య బృందం ఆలపించిన భక్తి గోష్ఠి గానం భక్తులను ఆకట్టుకుంది .ఈ కార్యక్రమంలో గురు రాజ్, సత్యనారాయణ చార్యులు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్ట్ కె.ఎల్. నరసింహా రావు ఈ కార్యక్రమాలను సమన్వయం చేయగా, సీనియర్ జర్నలిస్ట్ వద్ది రాజు జనార్ధన రావు అధ్యక్షత వహించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో, శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళా శాసనములతో, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం వారి సౌజన్యంతో, వికాస తరంగిణి మీర్పేట్ సహకారంతో, సీనియర్ జర్నలిస్ట్ వద్ది రాజు జనార్ధన రావు సమర్పణలో, జర్నలిస్ట్ కె.ఎల్. నరసింహా రావు శ్రీ వేముల రాజేశ్వర రావు సమన్వయంతో, శ్రీమాన్ డింగరి రంగాచార్యులు పర్యవేక్షణలో ధార్మికోపన్యాసకులు భాస్కరభట్ల ఆంజనేయశర్మ తిరుప్పావై ప్రవచనాలు జరుగుతున్నాయి .
ఈ తిరుప్పావై ప్రవచనాలు , భక్తి గోష్ఠి గానం ప్రతి రోజు సా|| 6 గంటల నుంచి జరుగుతాయి. వచ్చే నెల జనవరి 14వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని అందరూ ఆహ్వానితులే నని వద్ది రాజు జనార్ధన రావు తెలిపారు.