×

చెల్లె నీకదియే చక్కని వసంత కాలము refer by:kidambi sethu raman

చెల్లె నీకదియే చక్కని వసంత కాలము refer by:kidambi sethu raman

చెలియతో సరసములే కాలములాయే నీకు
పలుమారు యామె గూడి అవధరించవయ్య

కలికి మదిలోన కోరికల విరులు పూయగా
చెల్లె నీకదియే చక్కని వసంత కాలము
నెలత నిట్టూర్పు సెగలు నిను తాకినప్పుడు
కలిగే నీకదియే ఉష్ణపు కోడ కాలము

సుదతి మేని చెమటలోన నీవు తడసినపుడు
మోదముతో పొందేవు వర్ష కాలము
ముదిత కన్నులు చల్లని వలపు వెన్నెల జెల్లగా
అదియే నీకు నెల్లపుడు శరత్కాలము

తరుణి అంగజ సాములు మంచు వలే కురియగా
నిరతి నీవు చిత్తగించేవు హేమంత కాలము
సిరి కౌగిలిలో నీ వాంఛల పత్రములు రాలినపుడు
వర ప్రహ్లాదవరదుడా నీకదియే శిశిర కాలము
Means……Hey Prahladhavarada!

Love you have with your beloved is seasons to you.
Always be with her and enjoy that.

When wishes blooms in her heart like flower,then it is vasantha kalam for you.
When her hot uchwasa niswaasams touches you, then it is the hot koda kalam(summer) to you.

When you are wet in sweat of her body,then you happily enjoy rainy season.
When she showers moon light from her eyes then it is sharath kalam to you.

When her manmadha leela is showering like fog,then you enjoy that as hemantha kalam.
When all you are satisfied and falls like leaves in her hug then ,o Prahladhavarada it is sishira kalam to you.

print

Post Comment

You May Have Missed