తాడేపల్లి: పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. తాడేపల్లిలోని సీఎం వైయస్ జగన్ నివాసంలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పలువురు తల్లిదండ్రులు తమ చిన్నారులతో వచ్చారు. ఈ సందర్భంగా ఆ చిన్నారులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల వేసేందుకు కుటుంబ సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. స్కూళ్లు, కాలేజీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశారు.