“చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి “
దళిత ఐఏఎస్ అధికారిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేసారని , ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాట ఓబులేష్
డిమాండు చేశారు. కర్నూలు నగరంలోని వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓబులేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు బీసీజీ నివేదికపై మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఐఏఎస్ అధికారి విజయకుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బీఆర్ అంబేద్కర్ విగ్రహ పాదాలు పట్టుకొని క్షేమాపణ కోరాలని డిమాండు చేశారు. సమావేశంలో వైయస్‌ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజేష్, జిల్లా కార్యదర్శి రైల్వే ప్రసాద్, మహిళ రాష్ట్ర కార్యదర్శి రేణుకమ్మ, జిల్లా మహిళ విభాగం నాయకురాలు విజయకుమారి, కేదార్నాథ్, కట్టారి సురేష్, జిల్లా కార్యదర్శి రాజేష్, జీ రాజశేఖర్, సురేఖ, అది, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
Post Comment