*చంద్రగ్రహణం సందర్భంగా శ్రీశైలంలో 31 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి స్వామి అమ్మవార్ల ఆలయ ద్వారాలు మూసివేస్తారు .
*ఫిబ్రవరి 1 వ తేదీ వేకువజామున 3.౩౦ కు ఆలయ మహాద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి , సంప్రోక్షణ , శ్రీ స్వామి అమ్మవార్ల ప్రాతః కాల పూజల అనంతరం ఉదయం 6.౩౦ కు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనాలు , ఆర్జిత సేవలు ప్రారంభిస్తారు .
*31 వ తేదీ వేకువజామున 3.౩౦ కు ఆలయ ద్వారాలు తెరిచి మంగళ వాయుద్యాలు , సుప్రభాత సేవ , శ్రీ స్వామి అమ్మవార్లకు మహా మంగళహారతుల అనంతరం ఉదయం 5.౩౦ నుంచి ఉదయం 7.౩౦ వరకు సర్వ దర్శనానికి అవకాశం కల్పించారు .
* పరివార ఆలయాలలో కూడా పై విధంగానే ఆయా కైంకర్యములను నిర్వహిస్తారు .
* గ్రహణం కారణంగా అన్ని ఆర్జిత సేవలు , శాశ్వత సేవలు కూడా నిలిపివేశారు .
*అదే విధంగా 31 వ తేదీన నిత్య అన్నదాన కార్యక్రమం కూడా నిలిపివేశారు .