శ్రీశైల దేవస్థానం: నేడు ఘంటామఠ పునర్నిర్మాణ పనులు జరిపిస్తుండగా మరో రాగిరేకు (తామ్రశాసనం) లభ్యమైంది. 5 12 x 8 అంగుళాల సైజుగల ఈ రాగిరేకుపై నాగరిలిపిచెక్కి వుంది.నిన్నటి రోజున 28 రాగిరేకులు (తామ్రశాసనాలు లభించిన విషయం తెలిసిందే.
కాగా విషయము తెలిసిన వెంటనే కార్యనిర్వహణాధికారి ఘంటామఠం చేరుకుని సంబంధిత అధికారులతో కలిసి రాగిరేకును పరిశీలించారు. దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మురళీ బాలకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నరసింహారెడ్డి, సహాయ స్థపతి జవహర్, సహాయ ఇంజనీరు సురేష్ తదితరులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు.
రాగిరేకును కనుగొనిన వెంటనే స్థానిక పోలీస్, రెవెన్యూశాఖ అధికారులకు సమాచారాన్ని తెలిపారు. అదేవిధంగా నిబంధనల మేరకు పంచనామా చేసారు.స్థానిక తెలుగు విశ్వవిద్యాలయ డీన్ ప్రొఫెసర్ పి.చెన్నారెడ్డి కూడా ఘంటామఠం చేరుకుని ఈ రాగిరేకు ను (తామ్రశాసనాన్ని) పరిశీలించారు.
*Nandheeswara puja,Kumaraswaamy puja,Bayalu Veerabhadraswaamy puja performed in the temple today with temple traditions.