వార్షిక ఆర్థిక నివేదికలను, విరాళాల నివేదికలను, ఎన్నికల వ్యయ వివరాలను, గుర్తింపులేని రాజకీయ పార్టీలు-వాటి ప్రధాన కార్యాలయాలున్న రాష్ట్రాలలోని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయాల్లో మాత్రమే సమర్పించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా తమ కార్యాలయంలో మాత్రమే సమర్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.రజత్ కుమార్ సూచించారు,
గుర్తింపులేని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం లోగడ ఆగస్టు 29, 2014న, తిరిగి అక్టోబరు 14, 2014న, ఆ తరువాత పలుమార్లు తెలియచేసినప్పటికీ ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతున్నారని ఆయన తెలిపారు. ఈ రాజకీయ పార్టీలవారు హైదరాబాద్లోని సచివాలయం హెచ్ బ్లాక్లో ఉన్న తమ కార్యాలయంలో వార్షిక నివేదికలను సమర్పించాలని, ఢిల్లీకి పంపకూడదని పునరుద్ఘాటించారు.