అమరావతి : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘కరోనా’పై సమీక్ష నిర్వహించిన సీఎం వైయస్ జగన్.. అనంతరం నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్‌తో సమావేశమయ్యారు. గంటకుపైగా గవర్నర్‌తో చర్చించిన సీఎం వైయస్ జగన్ అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. స్థానిక ఎన్నికల వాయిదా, కరోనా నివారణ చర్యలపై గవర్నర్‌తో చర్చించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.