*సీఎం కేసీఆర్ ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ భాస్కర్.*గజ్వేల్ లో టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.*గజ్వేల్ లో 64 కేజీల భారీ కేకును కట్ చేస్తున్న ఎంపీ ప్రభాకర్ రెడ్డి,ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్.*గజ్వేల్ పట్టణంలో శనివారంనాడు జరిగిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల సభలో మాట్లాడుతున్న ఎంపీ ప్రభాకర్ రెడ్డి.
*గజ్వేల్ పట్టణంలో శనివారం సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టి.ఆర్.ఎస్. శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్న ఈ వేడుకలకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ,గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ భూమిరెడ్డి, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ భాస్కర్, జిల్లా టీఆర్ ఎస్వీ అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. 64 కేజీల భారీ కేకును ఎంపీ తదితరులు కట్ చేసి పంచిపెట్టారు. టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. పలు ఆలయాలలో కేసీఆర్ పేరున అర్చనలు,ప్రత్యేక పూజలు చేశారు.-చైతన్య,గజ్వేల్