×

క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం-మంత్రి హరీష్ రావు

క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం-మంత్రి హరీష్ రావు

*సిద్దిపేట మినీస్టేడియంలో శుక్రవారం హెచ్సీఏ ఆధ్వర్యంలో టి-20 లీగ్ క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభిస్తున్న రాష్ట్ర  భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు , క్రికెట్ లీగ్ మ్యాచ్ ను ప్రేక్షకుల గ్యాలరీలో హెచ్ సీఏ చైర్మన్ వివేక్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలతో కలిసి వీక్షిస్తున్న మంత్రి హరీష్ రావు, తొలిరోజు టి-20 లీగ్ మ్యాచ్ లో మ్యాన్ఆఫ్ ద మ్యాచ్  మెదక్ క్రీడాకారునికి బహుమతి అందిస్తున్న మంత్రి హరీష్ రావు

సిద్దిపేటలో ని క్రీడాస్టేడియంలో హెచ్సీఏ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి   టి-20 క్రికెట్ లీగ్ మ్యాచును రాష్ట్ర మంత్రి హరీష్ రావు శుక్రవారం ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే ఈ మ్యాచ్ ను మైదానంలో మంత్రి బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. ప్రభుత్వ సలహాదారు, హెచ్ సీఏ చైర్మన్ వివేక్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ,సిపి శివకుమార్,స్థానిక నేతలు, కీదాభిమానులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వo  క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. విద్య,ఉద్యోగాలతో పాటు క్రీడాకారులకు ఇండ్లను కూడా ఇవ్వటానికి చర్యలు తీసుకుంటామన్నారు.క్రీడా స్టేడియం ల అభివృద్ధి తో  గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల ప్రతిభను ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేస్తామన్నారు. సిద్దిపేటలో టి-20 మ్యాచ్ ను ఏర్పాటు చేసిన వివేక్ ను ఆయన అభినందించారు.
రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలకు చెందిన క్రికెట్ జట్లు ఈ  పోటీలో పాల్గొంటున్నాయి. శుక్రవారం ప్రారంభ మ్యాచ్ లో మెదక్ జట్టులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన క్రీడాకారునికి మంత్రి బహుమతి అందచేశారు. ఈ లీగ్ మ్యాచ్ లు తిలకించటానికి శనివారం సినీ ప్రముఖులు అక్కినేని అఖిల్, తరుణ్, ఆదివారం విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్ లతోపాటు ప్రముఖ క్రీడాకారులు వివిఎస్ లక్ష్మణ్ తదితరులు హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.- చైతన్య, గజ్వేల్

print

Post Comment

You May Have Missed