శ్రీశైల దేవస్థానం: ఈ నెల 16వ తేదీ నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కార్తీకమాసోత్సవాల ప్రారంభం నుంచి భక్తులకు అన్నపూర్ణ భవనములో అన్న ప్రసాద వితరణ ప్రారంభిస్తారు.కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అన్నప్రసాద వితరణను చేస్తారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3.00గంటల వరకు అన్నప్రసాదాల వితరణ చేస్తారు.
ఈ రోజు కార్యనిర్వహణాధికారి అన్నదాన విభాగాన్ని పరిశీలించి అన్నప్రసాదాల వితరణపై సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో అన్నదాన భవన సముదాయంలోని అన్నదాన ప్రదేశాలు, భక్తులు వేచి వుండే గదులు, అన్నదానం స్టోరు, వంటశాల, మినరల్ వాటర్ పొట్లాల తయారీ మొదలైన వాటిని కార్యనిర్వహణాధికారి పరిశీలించారు.కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అన్నప్రసాద వితరణ జరపాలని ప్రజాసంబంధాల అధికారి, అన్నదాన విభాగపు ఇంచార్జి శ్రీనివాసరావును పర్యవేక్షకులు శ్రీమతి దేవికను కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.అన్నదాన సమయములో భక్తులు భౌతికదూరం పాటించే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఒక్కో టేబుల్ కు మరో టేబుల్ కు మధ్య ఖాళీ ప్రదేశం ఉండేటట్లుగా టేబుళ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కో టేబుల్ వద్ద ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే భోజనం చేసే విధంగా విస్తర్లను వేయాలని సూచించారు. కరోనా నివారణ ముందస్తు చర్యలను సంబంధిత ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. భోజనానికి వచ్చే భక్తులందరు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించి అన్నదానం క్యూలైన్లలో రావాల్సి ఉంటుందన్నారు. క్యూలైన్లలో కూడా భౌతిక దూరాన్ని పాటించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా అన్నదానం క్యూలైన్లలో భౌతికదూరం పాటించేందుకు వృత్తాలతో మార్కింగ్ చేయాలని ఆదేశించారు.అన్నదాన ప్రవేశద్వారం వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి థర్మల్ గన్తో శరీర ఉష్ణోగ్రతను పరీక్షించాలన్నారు. అదేవిధంగా భక్తులు తమ చేతులను శానిటైజేషన్ చేసుకునేందుకు వీలుగా అన్నదాన క్యూలైన్ల వద్ద, అన్నదాన ప్రవేశద్వారం వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేయాలన్నారు.ఈ విషయమై లెగ్ ఆపరేటేడ్ శానిటైజర్లను ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.భక్తుల భోజనాలు పూర్తయ్యాక వారు చేతులు కడిగే ప్రదేశములో కూడా భౌతికదూరం పాటించేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసమై ఒక కుళాయికి మరొక కుళాయికి మధ్య తగినంత దూరం ఉండే విధంగా నీటి సరఫరాను కల్పించాలన్నారు. అన్నదానం క్యూలైన్లను, క్యూలైన్లపైపులను,అన్నదాన భవనములోని కటాంజాలను, రైలింగులు మొదలైన వాటిని నిర్ణీత సమయాలలో శాస్త్రీయ పద్ధతిలో శానిటైజేషన్ చేయాలన్నారు. సిబ్బంది అందరు కూడా కరోనా వైరస్ నివారణకు అవసరమైన అన్ని ముందుజాగ్రత్త చర్యలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలన్నారు. ముఖ్యంగా తరచుగా చేతులను శుభ్రపరుచుకోవాలన్నారు. వంటశాలలో విధులు నిర్వహించు వంటస్వాములు సబ్బునీటితో శుభ్రపరుచుకోవడం మంచిదని సూచించారు. ఎవ్వరు కూడా ఏమరుపాటుతో ఉండకూడదని అన్నారు.
అన్నదాన భవనాన్ని తరుచుగా శాస్త్రీయ పద్ధతిలో శుభ్రపరుస్తుండాలని కార్యనిర్వహణాధికారి అన్నారు. ముఖ్యంగా శుచిశుభ్రతపట్ల ప్రత్యేకశ్రద్ధ కనబరచాలన్నారు. కరోనా అరికట్టేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణ చర్యలు మొదలైనవాటి గురించి భక్తులలో అవగాహన కల్పించేందుకు మైకుద్వారా సూచనలు చేయాలని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. అన్నదాన ప్రాంగణములో కరోనాను అరికట్టేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఫ్లెక్సీబోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.సిబ్బంది అందరు భక్తులతో మర్యాదతతో మెలగాలన్నారు. ప్రధానంగా సమయపాలనను పాటిస్తూ అన్నప్రసాద వితరణను చేయాలన్నారు. లాక్ డౌన్ సమయములో దేవస్థానం స్థానికంగా ఉండే సాధువులకు, నిరాశ్రయులకు, యాచకులకు అన్నపొట్లాల ద్వారా అన్నప్రసాదాలను అందజేసింది. అదేవిధంగా దర్శనాలు పున:ప్రారంభం నుండి భక్తులకు పులిహోర, పెరుగన్నం, సాంబారన్నం మొదలైన వాటిని భక్తులకు అందజేయడం జరుగుతోంది. ప్రస్తుతం కార్తీకమాస రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్నదాన భవనములో పంక్తి భోజనాలుగా అన్నప్రసాదాల వితరణను చేయాలని నిర్ణయించారు.
ఈ పరిశీలనలో అన్నదాన సిబ్బంది, రక్షణ విభాగ పర్యవేక్షకులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
*శ్రీభ్రమరాంబికా సేవా సమితి A.P & .T.S H.O, చీరాల వారి ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మలికార్జునస్వామి వారి దేవస్థానం, శ్రీశైలం నిత్యాన్నదానవిభాగానికి 11/11/2020 న సుమారు లక్షన్నర రూపాయలు విలువైన వంట సామగ్రిని అందించారు.
*K.Narayana Reddy and Smt Ramanamma, Kurnool donated Rs.1,01,116 for Annadhaanam scheme in the temple.
*Nandheeshwara Pooja performed in the temple . E.O. participated in the event. Dattathreya Swami Pooja performed in the temple. Archaka swaamulu performed the puuja with traditions.