కోలుకుంటున్న క్షతగాత్రులు
*కోలుకుంటున్న క్షతగాత్రులు* *డిఎంఇ, సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఆహోరాత్రులు చికిత్స చేస్తున్న గాంధీ వైద్యలు* *నిరంతరం మానిటరింగ్ చేస్తున్న వైద్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి*
*గాంధీ దవాఖాన (సికింద్రాబాద్)ః* సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రిమ్మనగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు గాంధీ వైద్యులు, నర్సులు, సిబ్బంది ఆహోరాత్రులు వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. మంత్రి ఆదేశాలతో వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్‌రెడ్డి, గాంధీ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్‌లు క్షతగాత్రుల వైద్యసేలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో తీవ్ర గాయాలతో వచ్చిన పేషంట్లు కోలుకుంటున్నారు. అందులో ఒకరు వెంటిలేటర్ మీద, మరొకరు అపస్మారక స్థితిలో ఉండగా, ఒకరికి శనివారం రాత్రే శస్త్ర చికిత్సచేశారు. ఇద్దరు దురదృష్ట వశాత్తు మరణించగా, మిగతా క్షతగాత్రులు కోలుకుంటున్నారు. శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశాలతో మొత్తం ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఒకవైపు ఘటనా స్థలానికి సమీపంలో ఉన్నగజ్వేల్ దవాఖానాలో ప్రాథమిక చికిత్సకు ఏర్పాట్లు చేసింది. మరోవైపు గాంధీ దవాఖానాలో సూపరింటెండెంట్ నేతృత్వంలో ప్రొఫెసర్లు, వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, రెసిడెంట్లు, పీజీలు, హౌస్‌సర్జన్లు, సిబ్బందిని సంసిద్ధం చేసింది. క్షతగాత్రులకు అవసరమైన మందులు, శస్త్ర చికిత్సకు ఆపరేషన్ థియేటర్లను సిద్ధం చేశారు. సిద్దిపేట జిల్లా డిఎంఅండ్‌హెచ్ఓ స్వయంగా వెంట ఉండి క్షతగాత్రులను గాంధీకి తరలించారు.
గాంధీ దవాఖానాకు పేషంట్లు వచ్చిన వెంటనే సిద్ధం చేసిన ఎమర్జెన్సీ వార్డులో దాదాపు 50మంది డాక్టర్లు, సిబ్బంది వైద్య సేవలు అందించారు. అర్థరాత్రి అందులో తూప్రాన్ కు చెందిన 12 ఏళ్ళ శ్రీకాంత్‌కి లివర్ సంబంధ సమస్య రావడంతో శస్త్ర చికిత్స చేశారు. తూప్రాన్‌కు చెందిన లక్ష్మీ(30), పుష్పలత, ల ఆరోగ్యం నిలకడగా ఉంది. రంగాపూర్‌కి చెందిన శృతి(6), తూప్రాన్‌కి చెందిన రేవతి(3)కోలుకుంటున్నారు. కాగా, హైదరాబాద్‌కి చెందిన సురేశ్‌చంద్రారెడ్డి, శ్రీకాంత్‌లకు ఎముకల సంబంధమైన సమస్యలేవీ లేవు. రంగాపూర్ కి చెందిన రాములయ్య(50), ఆదిలాబాద్‌కి చెందిన వినయ్, విజయ కోలుకుంటున్నారు. ఇక తలకు, ఛాతీలో తీవ్రమైన గాయాలైన ఓంకార్(11), నర్సింహులు (40)లు మృతి దురదృష్టవశాత్తు మరణించారు. డెడ్ బాడీలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పార్థీవ వాహనాలల్లో వారి ఇళ్ళకు తరలించారు.
గాంధీలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. వాళ్ళకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకుని, సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కి, ఇతర డాక్టర్లకు తగు సూచనలు చేశారు. వైద్య మంత్రి లక్ష్మారెడ్డి సూచనలు, ఆదేశాల మేరకు మంచి వైద్యం అందిస్తున్నామని, అహోరాత్రులు డాక్టర్లు, సిబ్బంది వాళ్ళకు నిరంతరం వైద్యం అందిస్తున్నారని డిఎండి వివరించారు.
Post Comment