కొత్త జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో ప్రజలందరికి ప్రభుత్వ ఫలాలు అందేలా అధికారులు మరింతగా పని చేయాలని మంత్రి జోగు రామన్న కోరారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికి అందుతాయన్నారు. బిసి, గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేసేలా హైదరాబాద్ ఎంసిఆర్ హెచ్ఆర్డీలో మంత్రి జోగు రామన్న వర్క్ షాప్ ను ప్రారంభించారు. బిసిలకు, గిరిజనులకు కేటాయిస్తున్న నిధులు, అమలు చేస్తున్న పథకాలను మంత్రి సమీక్షించారు.