×

.జూలై నెలాఖరు నాటికి కొండపోచమ్మ సాగర్ పనులు పూర్తి-మంత్రి హరీష్ రావు

.జూలై నెలాఖరు నాటికి కొండపోచమ్మ సాగర్ పనులు పూర్తి-మంత్రి హరీష్ రావు

సిద్దిపేటజిల్లా కొడకండ్ల వద్ద కొండపోచమ్మ సాగర్ కాలువల నిర్మాణ పనులను పరిశీలిస్తున్న రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు.– చైతన్య, గజ్వేల్.
*దక్షిణ తెలంగాణ జిల్లాలకు వరప్రదాయనిగా మారనున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు,దాని పరిధిలో చిన్న రిజర్వాయర్ల నిర్మాణ పనులను భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అహర్నిశలు పరిశీలిస్తున్నారు.ఈ నేపథ్యంలో బుధవారం సిద్దిపేట జిల్లాలో దుబ్బాక,గజ్వేల్ నియోజక వర్గాల్లో మంత్రి పర్యటించారు. మల్లన్న సాగర్,కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల కింద నిర్మిస్తున్న కాలువల పనులను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి పరిశీలించారు.మల్లన్న సాగర్ నుంచి వచ్చే నీరు గజ్వేల్ మండలం కొడకండ్ల, అక్కారం గ్రామాల ద్వారా కొండపోచమ్మ సాగర్ లోకి చేరుతుంది. ఈ రెండు గ్రామాల వద్ద నిర్మిస్తున్న కాలువల పనులను పరిశీలించిన మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.వచ్చే నెలమొదటి వారానికి పంప్ హౌజ్ కాంక్రీటు పనులు ప్రారంభిస్తామన్నారు.జూలై నెలాఖరు నాటికి కొండపోచమ్మ సాగర్ పనులు పూర్తి చేస్తామన్నారు. రెండు వారాల్లో నిర్వాసితుల కోరిక మేరకు ఇల్లు నిర్మాణం లేదా తగినంత డబ్బు కానీ అందచేస్తా మన్నారు. రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయితే తాము ప్రజలకు దూరమవుతామన్న అక్కసుతో కాంగ్రెస్ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని హరీష్ రావు ఆపార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ సంస్థ చైర్మన్ భూమిరెడ్డి,జిల్లా టీఆరెస్ నాయకులు పి. రవీందర్ రావు. మాదాసు శ్రీనివాస్ లున్నారు.
-చైతన్య, గజ్వేల్
print

Post Comment

You May Have Missed