కేరళ రాష్ట్రానికి సహాయం
ఇటీవల వరద బీభత్సానికి కకావికలైన కేరళ రాష్ట్రానికి సహాయంగా తమ వంతు బాధ్యతగా ఫోరమ్ ఫర్ సోషల్ ఛేంజ్ (సామజిక మార్పు వేదిక) తరఫున సభ్యులు తమ వ్యక్తిగత విరాళంగా ఇచ్చిన ఒక లక్ష రూపాయల చెక్కును కేరళ సీఎం ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కు పంపిస్తున్నారు. కేరళ సామాజిక ఆర్దిక రంగాలలో మళ్లీ పుంజుకొని, పూర్వ స్థితికి వచ్చి నవ కేరళ నిర్మాణం కావాలని ఫోరమ్ ఫర్ సోషల్ చేంజ్ కోరుకుంటున్నది. తమ సాయం ఎంత మొత్తం అన్నది కాకుండా, తమ సభ్యుల విరాళాలు మాత్రమే సేకరించామని ఫోరమ్ ఫర్ సోషల్ ఛేంజ్ భావిస్తున్నది.
ఫోరమ్ ఫర్ సోషల్ చేంజ్ కన్వీనర్ అల్లం నారాయణ, కో-కన్వీనర్ సాంబమూర్తి, ప్రభు, కొప్పుల నర్సన్నలతో కలిసి చెక్కును నేరుగా సీఎం కార్యాలయానికి పంపించారు.
Post Comment