ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైయస్ జగన్‌మోహన్ రెడ్డి కలిశారు. ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని సీఈసీ సునీల్ అరోరా దృష్టికి వైయస్ జగన్ తీసుకెళ్ళారు.చంద్రబాబు ప్రభుత్వం ఓటర్ లిస్టులో డూప్లికేట్ ఓటర్లను చేర్చడం,పోలీసు వ్యవస్థను చంద్రబాబు తన స్వార్థానికి ఉపయోగించుకోవడం,అధికార యంత్రాంగ దుర్వినియోగం చేస్తోందని ఈసీకి ఫిర్యాదు చేశారు.సర్వేల పేరుతో లక్షలాది ఓట్లను తొలగించారని సీఈసీకి తెలిపారు.పోలీసులు టీడీపీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు.ఓటర్ల జాబితా అక్రమాలపై జోక్యం చేసుకోవాలని ఈసీని వైయస్ జగన్ కోరారు. ఆయన వెంట ఎంపీలు,మాజీ ఎంపీలు,ముఖ్యనేతలు ఉన్నారు.