తెలంగాణపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌గడ్కరీ వరాలు కురిపించారు. జాతీయ రహదారుల అభివృద్ధి కోసం రూ.800 కోట్ల విడుదలకు సుముఖత వ్యక్తం చేశారు. అందులో వెంటనే రూ.400కోట్లు ఇచ్చేందుకు పచ్చజెండా ఊపారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ, బిజెపి శాసనసభా పక్షనేత జి.కిషన్‌రెడ్డి ఆగస్టు 23న గడ్కరీని కలిసి వివిధ అంశాలపై వినతిపత్రాన్ని అందజేశారు. దీనికి గడ్కరీ సానుకూలంగా స్పందించారు. తెలంగాణలోని మరో 650కి.మీ. రోడ్లను జాతీయ రహదారులుగా ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా గడ్కరీ హామీ ఇచ్చారు. ఇప్పటికే దాదాపు 50వేల కోట్ల రూపాయలతో 1,900 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేసేందుకు అంగీకరించింది. కేంద్రం సహకారంతో తెలంగాణలో రాష్ట్ర రహదారుల మరింత అభివృద్ధి చెందనున్నాయి. రాష్ట్రాభివృద్ధికి మార్గం సుగమం కానుంది.