కృష్ణా జిల్లాలో కరోనా బాధిత జర్నలిస్టులకు వైద్య సహాయం కోసం డిపిఆర్ఓ యం . భాస్కర నారాయణను జిల్లా స్థాయి నోడల్ అధికారిగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ ఏ.యండి . ఇంతియాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.కరోనాను ముందువరుసలో వుండి పోరాడుతున్న వారిలో జర్నలిస్టులు కూడా ఉన్నారు . అందుకే కరోనా బారినపడిన జర్నలిస్టులు , వారి కుటుంబ సభ్యులకు సత్వర వైద్యం అందించేందుకు సమాచారశాఖ తరపున జిల్లా స్థాయి నోడల్ అధికారిగా భాస్కరనారాయణను నియమించామన్నారు . వైద్య ఆరోగ్య శాఖ తరపున డా . చైతన్యకృష్ణను నోడల్ అధికారిగా నియమించామన్నారు . వీరు ఇరువురు జిల్లాలో జర్నలిస్టులు ,వారి కుటుంబసభ్యులకు అవసరమైన కోవిడ్ సేవలకోసం సమన్వయకర్తలగా వ్యవహరిస్తారన్నారు . కోవిడ్ ఆసుపత్రుల నోడల్ అధికారులు కూడా జర్నలిస్టులకు కరోనా వైద్యం అందించడంలో జర్నలిస్టుల సమన్వయకర్తలకు సహకారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు . కోవిడ్ వ్యాధి బారినపడిన జర్నలిస్టులు , వారి కుటుంబసభ్యుల వైద్య సహాయం కోసం డి పి ఆర్ ఒ యం . భాస్కరనారాయణ ( 9121215285 ) డా . చైతన్యకృష్ణ ( 6300881194 ) సంప్రదించవచ్చన్నారు . ఈ సందర్భంలో జర్నలిస్టులు తమ అక్రిడేషన్ , ఆధార్ వంటి సమాచారాన్ని తెలియజేయవలసి ఉంటుందన్నారు.