మంగళవారం వార్షిక కుంభోత్సవానికి శ్రీశైలం సిద్ధంగా ఉంది . లోక సంక్షేమం నిమిత్తం శ్రీశైల అమ్మవారికి ప్రత్యేక తరహాలో జరిపే ఈ కార్యక్రమానికి దేవస్థానం యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది . అమ్మవారికి సాత్విక కైంకర్యం జరిపేందుకు గాను ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు . పలువురు భక్తులు నిమ్మకాయలు, కొబ్బరికాయలు , గుమ్మడికాయలు మొదలైన వాటిని సమర్పించారు . ఉత్సవానికి గాను అమ్మవారికి వివిధ ప్రాంతాల వారు గాజులు , వస్త్రాలు ,నల్లపూసలు సమర్పించారు .
సోమవారం కర్నూలు జిల్లా కల్లూరు కు చెందిన శ్రీమతి డి.లక్ష్మి మహేష్ భాగవతారిణి పార్వతి కల్యాణం హరికథా గానం చేసారు . జంబన్న తబలాపై , టి.ధనుంజయ కీబోర్డ్ సహకారాన్ని అందించారు. శ్రీశైలం దేవస్థానం అన్నదానం పథకానికి డా. ఆర్. శివా రెడ్డి Rs. 1,01,116/- విరాళం అందించారు . ఎస్ . సత్యనారాయణ రావు Rs,1,00,000 విరాళం అందించారు .
సోమవారం సహస్ర దీపార్చన సేవ , వెండి రథోత్సవం ఘనంగా జరిగింది , భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Post Comment